ఓపక్క టీడీపీ వెళితే... మరోపక్క నితీశ్ వచ్చారు!: అమిత్‌ షా

  • చాలా పార్టీలు కొత్తగా వచ్చాయి
  • గత సార్వత్రిక ఎన్నికల తరువాత 11 పార్టీలు వచ్చాయి
  • చంద్రబాబు మాత్రమే బయటకు వెళ్లారు
ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్లిపోయినప్పటికీ చాలా పార్టీలు కొత్తగా వచ్చాయని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ప్రధాని మోదీ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తీసుకుంటోన్న నిర్ణయాల వల్ల ఎన్డీయే నుంచి పలు పార్టీలు వైదొలగాయని వస్తోన్న విమర్శలకు చెక్‌ పెట్టారు.

ఎన్డీఏలోకి బీహార్‌ నుంచి సీఎం నితీశ్ కుమార్‌ పార్టీ వచ్చిందని, గత సార్వత్రిక ఎన్నికల తరువాత 11 పార్టీలు తమ కూటమిలో భాగస్వామ్యమయ్యాయని అమిత్‌ షా తెలిపారు. తమ కూటమి పెరుగుతోందని చెప్పారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు మాత్రమే బయటకు వెళ్లారని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Telugudesam
NDA
amith shah

More Telugu News